: ‘ధోనీ’ భాగస్వామ్య సంస్థకు రైనా గుడ్ బై!...ఐఓఎస్ తో మూడేళ్లకు రూ.35 కోట్లకు కొత్త ఒప్పందం


టీమిండియా జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా... తన ఆరాధ్య క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భాగస్వామిగా ఉన్న రితి స్పోర్ట్స్ కు గుడ్ బై చెప్పాడు. ఆటగాళ్ల ఎండార్స్ మెంట్ వ్యవహారాలు చూసే ఐఓఎస్ స్పోర్ట్స్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడేళ్లకు రూ.35 కోట్లు ఇచ్చేలా ఈ కొత్త ఒప్పందం కుదిరింది. ధోనీ భాగస్వామిగా ఉన్న రితి స్పోర్ట్స్... ధోనీ, రైనా సహా మరికొంత మంది క్రికెటర్ల ఎండార్స్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. అయితే కెప్టెన్ భాగస్వామిగా ఉన్న సంస్థలతో క్రికెటర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వ్యవహారాలపై వివాదాలు ముసిరిన నేపథ్యంలోనే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి మూడేళ్ల పాటు రైనాకు సంబంధించిన ఎండార్స్ మెంట్స్, కార్పొరేట్ ప్రొఫైల్, డిజిటల్ హక్కులు, పేటెంట్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అతడి ఫొటోలు తదితర వ్యవహారాలన్నీ ఐఓఎస్ స్పోర్ట్స్ పర్యవేక్షించనుంది.

  • Loading...

More Telugu News