: అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్ట్... దుబాయ్ పారిపోతుండగా పట్టివేత


చిత్తూరు జిల్లా పోలీసులు మరో అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ కు సంకెళ్లేశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తూ పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించిన కందస్వామి వెంకటేశ్ అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన కొల్లం గంగిరెడ్డితో పాటు మరో ఎర్ర స్మగ్లర్ సాహుల్ కు ఇతడు ప్రధాన అనుచరుడిగానూ కొనసాగాడు. ఇతడి కదలికలపై నిఘా వేసిన పోలీసులు, నిన్న చెన్నైలో అరెస్ట్ చేశారు. పోలీసుల నిఘా పెరగడంతో గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ చెక్కేసేందుకు ప్లాన్ చేసుకున్న కందస్వామి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అతడికి అరదండాలేశారు. అనంతరం అతడిని తిరుపతి పరిధిలోని రేణిగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇతడిపై చిత్తూరు, కడప జిల్లాల్లో 16 కేసులు నమోదైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News