: బయ్యారంలో కర్మాగారం ఏర్పాటు కష్టమే: బొత్స
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అధికార కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం సహా, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వంటి మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తుంటే.. పీసీసీ చీఫ్ బొత్స మాత్రం తనదైన శైలిలో సీన్ ను రక్తి కట్టించారు. అసలక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాంకేతికపరంగా ఏమాత్రం అవకాశాల్లేవని స్పష్టం చేశారు. బయ్యారం గనుల్లో లభ్యమయ్యే ఖనిజ నాణ్యత, పరిమాణం కర్మాగారం ఏర్పాటుకు సరిపోవని బొత్స తేల్చిచెప్పారు.