: నటీనటులపై యాసిడ్ దాడి చేసిన డైరెక్టర్
భోజ్ పురి సినీ పరిశ్రమలో దారుణం చోటు చేసుకుంది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులపై అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిద్దరూ షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజీ ప్రాంగణంలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వెంటనే అజయ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ గోస్వామి తెలిపారు. గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రూపాలిపై కోపంతోనే అజయ్ ఈ పని చేశాడని... తన ఇష్టానికి వ్యతిరేకంగా వికాస్ తో కలసి నటిస్తున్నందుకే యాసిడ్ దాడి చేశాడని చెబుతున్నారు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.