: ఒంటిమిట్ట రామాలయాన్ని భద్రాచలంలా అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయం
ఈ రోజు సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరిగిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంపై ప్రధానంగా చర్చించింది. భద్రాచలంలాగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా చర్చించారు. రెండు నెలల కాలంలో తలనీలాల విక్రయం ద్వారా రూ.19 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. రాజమండ్రి, విజయవాడలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, టీటీడీ ఉద్యోగులకు అలవెన్స్ 1500 నుంచి రూ.2,500లకు పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ సత్రాలను ఆధునికీకరించాలన్న నిర్ణయానికి బోర్టు సభ్యులంతా ఆమోదం తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో వెయ్యికాళ్ల మండపం నిర్మించాలని కూడా నిర్ణయించారు.