: బ్రెయిన్ ట్యూమర్ తో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మృతి


దక్షిణాఫ్రికా క్రికెట్లో విషాదం అలముకుంది. మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ (66) మంగళవారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఫిబ్రవరిలో ఆయన ఓ సందర్భంగా కుప్పకూలిపోవడంతో ట్యూమర్ ను గుర్తించారు. రైస్ బతకడం కష్టమని ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వైద్యులు తెలపగా, బతుకుపై ఆశతో శస్త్రచికిత్స కోసం ఆయన భారత్ వచ్చారు. అటుపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "అందరం వెళ్లిపోవాల్సిన వాళ్లమే. కానీ, నాకైతే తొందరేమీ లేదు" అని పేర్కొన్నారు. ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష తీవ్రంగా ఉండడంతో అంతర్జాతీయ క్రీడారంగం నుంచి ఆ దేశాన్ని వెలివేశారు. ఆ ప్రభావం సఫారీ జట్టుపైనా పడింది. ఆ సుదీర్ఘ నిషేధం తొలగిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమమైంది. అప్పడు క్లైవ్ రైస్ నాయకత్వంలోనే సఫారీ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేసింది. కాగా, రైస్ మరణం పట్ల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News