: ఐదు వేల ఏళ్ల నాటి ఇంట్లో 97 అస్తిపంజరాలు
ఐదు వేల ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఓ ఇంట్లో ఏకంగా 97 అస్తిపంజరాలు బయటపడ్డాయి. ఈశాన్య చైనాలోని హమిన్ మంఘా ప్రాంతంలో పురాతత్వ శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ ఇల్లు బయటపడింది. ఓ అంటు వ్యాధి కారణంగానే వీరంతా మూకుమ్మడిగా చనిపోయి ఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చనిపోయిన వారిలో చిన్న పిల్లలు, యవ్వన దశలోని వారు, మధ్య వయస్కులు ఉన్నారని వారు తెలిపారు. తవ్వకాల్లో బయటపడిన ఇల్లు స్క్వాష్ కోర్టు కంటే చిన్నగా ఉంది.