: ఆ డ్రోన్ ను భారత సైన్యమే పంపిందని ఫోరెన్సిక్ నివేదిక చెబుతోంది: పాక్
నియంత్రణ రేఖ వెంబడి ఇటీవల పాకిస్థాన్ బలగాలు ఓ డ్రోన్ ను నేలకూల్చాయి. అయితే, ఆ డ్రోన్ ను భారత సైన్యమే తమ భూభాగంలోకి పంపిందని తొలుత పాక్ ఆరోపించగా, ఆ డ్రోన్ తయారీదారైన చైనా సంస్థ డీజేఐ తాము ఆ డ్రోన్ ను ఏ ప్రభుత్వానికీ విక్రయించలేదని స్పష్టం చేసింది. కానీ, పాక్ మాత్రం అది భారత్ కు చెందినదేనంటూ గట్టిగా వాదిస్తోంది. దాన్ని ఆపరేట్ చేసింది భారత సైన్యమేనన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తేలిందని పాక్ ఆర్మీ పేర్కొంది. ఆ డ్రోన్ లో నిక్షిప్తమైన ఛాయాచిత్రాలను వెలికితీసి పరీక్షించగా, అది భారత్ నుంచి వచ్చినట్టు తెలిసిందని పాక్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.