: పాసు పుస్తకాలు లేకున్నా ఏపీ రైతులకు బ్యాంకు రుణాలు


బ్యాంకు రుణాల విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు బ్యాంకుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ సౌకర్యం కల్పించబోతోంది. ఇకపై రైతుల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13వేల ట్యాబ్ లు ఇస్తున్నామని తెలిపారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్ లోడ్ చేస్తామన్నారు. వాటితో పాటు భూ యజమానుల వివరాలు, పంట వివరాలు కూడా ఆన్ లైన్ లో ఉంచుతామని చెప్పారు. రైతుల భూ రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామని, అందుకోసం వచ్చే నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో గ్రామసభలు నిర్వహిస్తున్నామని పరకాల వివరించారు.

  • Loading...

More Telugu News