: రాష్ట్ర విభజనపై కలాం ఏమన్నారో వెల్లడించిన గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏమన్నారనే విషయాన్ని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. "జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది రెండు రాష్ట్రాల అభివృద్ధి. అనుభవం కలిగిన నీవు రెండు రాష్ట్రాలను ఆ దిశగా తీసుకెళ్లు" అని కలాం తనకు సూచించారని నరసింహన్ తెలిపారు. ఆయనను ఎప్పుడు కలిసినా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించే మాట్లాడేవారని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు కలాంతో పాతికేళ్లుగా అనుబంధం ఉందని తెలిపారు.