: రాజాజీ మార్గ్ కు పోటెత్తిన యువత
రాజాజీ మార్గ్ లోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతిక కాయం చూసేందుకు యువతరం పోటెత్తింది. తమ అభిమాన గురువును చివరి సారి చూసుకునేందుకు యువకులు తరలి వచ్చారు. దీంతో రాజాజీ మార్గ్ కిటకిటలాడుతోంది. విద్యార్థులు, యువకులు భారీ ఎత్తున తరలి రావడంతో కిలో మీటర్ల మేర క్యూ ఏర్పడింది. ఢిల్లీలో నివాసం ఉంటున్న తమిళులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిలో వయసు మీరినవారు కూడా ఉండడం విశేషం. ఆయన రగిలించిన స్ఫూర్తిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుకున్న యువత ఆయనను కడసారి చూసేందుకు భారీ ఎత్తున చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యువకులు ఆయనను చూసేందుకు తరలి వస్తున్నారు. కాగా, నాలుగు గంటల నుంచి కలాం భౌతిక కాయాన్ని చూసేందుకు సాధారణ పౌరులను అధికారులు అనుమతించారు.