: నేనే కాదు, కలాంను కలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు: గంగూలీ
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. కలాం నిరాడంబరత తననే కాదని, ఆయనను కలిసిన ఎవరినైనా ఆకట్టుకుంటుందని తెలిపారు. "కలాంను పలుమార్లు కలిశాను. వ్యక్తిగతంగానూ తెలుసాయన. ఆయన నిరాడంబరుడు అన్న విషయం నేనే కాదు, ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఆ సులక్షణం కారణంగానే ఎందరో ఆయనకు అభిమానులయ్యారు. కలాం భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించారు... ఆయన ఓ సైన్స్ మేధావి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆ రోజంటూ వస్తే ఎవరైనా గతించక తప్పదు" అని పేర్కొన్నారు. ఢిల్లీలో అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ డెంగ్యూ కేర్ ప్రచారం సందర్భంగా కలాం మరణాన్ని ప్రస్తావిస్తూ గంగూలీ పైవిధంగా పేర్కొన్నారు.