: ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు ఎల్లుండి (గురువారం) జరగనున్నాయి. ఈ మేరకు రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం సాయంత్రం 7 గంటల వరకు ఉంచనున్నారు. తరువాత గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాచారం. అంత్యక్రియల కోసం ఇప్పటికే రామేశ్వరంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. అంతకుముందు కలాం అంత్యక్రియలు రేపే నిర్వహిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.