: కలాం అంత్యక్రియలకు హాజరుకానున్న తమిళనాడు గవర్నర్


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరంలో నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో, అధికారిక లాంఛనాలతో జరగనున్న కలాం అంత్యక్రియలకు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు తమిళనాడు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తో బాటు, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కలాంను గురువుగా భావించే ఎంతో మంది అంత్యక్రియల్లో పాలుపంచుకోనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News