: శ్రీలంక టూర్ ను కూడా రవిశాస్త్రితోనే నెట్టుకురావాలని బీసీసీఐ నిర్ణయం


డంకన్ ఫ్లెచర్ తప్పుకున్నాక టీమిండియాకు కోచ్ అంటూ లేకుండాపోయాడు. దాంతో, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రికి అదనపు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. తాజాగా శ్రీలంక తో సిరీస్ సందర్భంగానూ శాస్త్రే జట్టు బాధ్యతలు మోయనున్నారు. సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు ఫుల్ టైమ్ కోచ్ ను ఎంపిక చేస్తామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇతర సిబ్బంది ఎంపిక కూడా అప్పుడే ఉంటుందని వివరించారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు కోచ్ ను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News