: నినుదలంచని హృదయం లేదు...శోకతప్తమైన సోషల్ మీడియా
దేశం యావత్తూ విషాదంలో మునిగిపోయింది. నిగర్వి, నిరాడంబరుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకస్మిక మరణంతో ప్రతి భారతీయుడూ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్ మీడియాలో ఇంటి దగ్గర్నుంచే అంతా ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఆయన చెప్పిన ప్రసంగాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన బాటలో నడవడానికి తమ ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రగిలించిన స్ఫూర్తిని కొనసాగిస్తామని మరి కొంతమంది ప్రమాణం చేస్తున్నారు. దేశం యావత్తూ కలాం స్మరణలో మునిగిపోయిందనడానికి సోషల్ మీడియానే చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి 'రిప్' (రెస్ట్ ఇన్ పీస్) అబ్దుల్ కలాం అనే నినాదంతో తమ గౌరవాన్ని చాటుకున్నారు. దీంతో సోషల్ మీడియా శోకతప్తమైంది.