: మరణానికి ముందు ఓ కానిస్టేబుల్ ను పొగిడిన కలాం!
మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కన్నుమూయడంతో దేశంలో విషాదం అలముకుంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఐఐఎం సదస్సులో మాట్లాడుతూ ఆయన కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అంతకుముందు, తనను కాసేపట్లో మృత్యువు కబళిస్తుందని తెలియని ఆ మహోన్నతుడు ఓ సాధారణ కానిస్టేబుల్ సేవలను కొనియాడారు. గౌహతీ నుంచి షిల్లాంగ్ వరకు తాను ప్రయాణించాల్సిన మార్గాన్ని ఆ కానిస్టేబుల్ నిశితంగా పరిశీలించాడని, తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాడని అభినందించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ కు చెందిన ఆ కానిస్టేబుల్ తొలుత వెనుకంజ వేసినా, ఆపై ధైర్యం పుంజుకుని కష్టతరమైన బాధ్యతలను సవాల్ గా స్వీకరించాడని, అప్రమత్తంగా వ్యవహరించాడని ప్రత్యేకంగా ప్రస్తావించారట కలాం. ఈ విషయాలను ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా ఎస్పీ ఎం.ఖర్ఖరాంగ్ తెలిపారు.