: కలాం పుట్టిన రోజును 'అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం'గా జరపాలని నిర్ణయించిన ఐక్యరాజ్యసమితి
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కు ఐక్యరాజ్యసమితి ఘన నివాళి అర్పించింది. కలాం పుట్టిన రోజు అయిన అక్టోబర్ 15వ తేదీని ప్రతియేటా 'అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం'గా నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో కూడా అనుక్షణం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ఆయన యత్నించారని కీర్తించింది. భారత రాష్ట్రపతిగా ఆయన ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడింది.