: కలాం భౌతికకాయాన్ని తిరువనంతపురం తీసుకురావాలని కోరిన ఉమెన్ చాందీ


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని కేరళ రాజధాని తిరువనంతపురం తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం ఊమెన్ చాందీ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. ప్రజల సందర్శనార్ధం, నివాళులర్పించేందుకు ఆయన భౌతికకాయాన్ని తమ రాజధానిలో కొన్ని గంటల పాటు ఉంచేందుకు అనుమతివ్వాలని తెలిపారు. 1960 నుంచి 80 వరకు కలాం ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన సమయంలో ఇక్కడే ఉన్నారని, ఈ రాష్ట్రంతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే రామేశ్వరం తీసుకువెళ్లేముందు ఆయనను తిరువనంతపురం తీసుకురావాలని రాజ్ నాథ్ ను చాందీ విజ్ఞప్తి చేసినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. అంతేగాక ప్రధానమంత్రికి, ఇతర కేబినెట్ మంత్రులకు కూడా లేఖలు రాశారని వెల్లడించింది. రేపు జరగనున్న కలాం అంత్యక్రియలకు కేరళ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. ఇందుకు స్పందించిన రాజ్ నాథ్, కలాం కుటుంబసభ్యులతో మాట్లాడిన తరువాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News