: ఏపీ పాఠశాలల సమయం గంట పెంపు... కలాం జీవనయానంపై విద్యార్థులకు బోధన


ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పనివేళలను నేడు గంట పాటు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి క్రితం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా పెంచిన సమయంలో ఆయా పాఠశాలల్లో కలాంకు నివాళి అర్పించడంతో పాటు విద్యార్థులకు కలాం జీవిత చరిత్రపై ప్రత్యేక క్లాసులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుధారాణి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News