: ‘పాలం’లో కలాం భౌతిక కాయానికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం కొద్దిసేపటి క్రితం వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లు కలాం మృతదేహానికి నివాళి అర్పించారు. మరికాసేపట్లో కలాం పార్థివ దేహాన్ని రాజాజీ మార్గ్ లోని ఆయన అధికారిక నివాసానికి తరలించనున్నారు. నేటి సాయంత్రం దాకా ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని అక్కడే ఉంచుతారు.