: ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఏసీబీ... సండ్ర పేరు లేదు!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి, సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ, జెరూసలెం మత్తయ్యల పేర్లను ప్రస్తావించిన ఏసీబీ అధికారులు, కేసులో ఇప్పటిదాకా 39 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇటీవలే అరెస్టయి బెయిలుపై విడుదలైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేరు నేటి చార్జిషీటులో కనిపించలేదు. అయితే,సండ్రకు సంబంధించిన వ్యవహారంలో ప్రత్యేక చార్జీషీటు దాఖలు చేయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News