: మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీంకోర్టు బెంచ్ లో భిన్నాభిప్రాయాలు...విస్తృత ధర్మాసనానికి బదిలీ!


ముంబయి వరుస పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ పిటిషన్ పై సుప్రీంకోర్టు జడ్జిలు భిన్నమైన తీర్పు వెల్లడించారు. తనకు అమలు చేయబోతున్న ఉరిశిక్షను నిలుపుదల చేయాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈరోజు విచారించింది. మెమన్ పిటిషన్ ను దవే కొట్టివేయగా, జోసెఫ్ మాత్రం స్టే ఇచ్చారు. ఈ క్రమంలో యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ పై న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రేపు ఆ పిటిషన్ పై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు యాకూబ్ కు క్షమాభిక్ష పెట్టాలని, అతని శిక్షను జీవితకాల శిక్షగా మార్చాలని అతని భార్య రాహీన్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News