: అక్కాచెల్లెళ్లను పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది అరెస్ట్


హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ పరిధిలో ఇటీవల అక్కాచెల్లెళ్లను పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది అమిత్ సింగ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీలేఖను ప్రేమిస్తున్నానని వెంటబడ్డ అమిత్ సింగ్, తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా ఈ నెల 14న ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన శ్రీలేఖ సోదరి యామినిపైనా అతడు కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో అక్కాచెల్లెళ్లిద్దరూ చనిపోయారు. యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాదు ఎస్ఓటీ పోలీసులు నేటి ఉదయం అమిత్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News