: మాజీ ఎంపీ హర్షకుమార్ కు బెయిల్
మాజీ ఎంపీ హర్షకుమార్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీక్షా సమయంలో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. క్రైస్తవులకు శ్మశాన వాటికకోసం స్థలం కేటాయించాలంటూ కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో హర్షకుమార్ ఆమరణ దీక్ష చేపట్టారు. అక్కడే అకస్మాత్తుగా గాల్లోకి కాల్పులు జరపడంతో వెంటనే పోలీసులు ఆయన చేతిలోని తుపాకీని లాక్కొని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం అరెస్టు చేశారు. తరువాత స్థానిక కోర్టులో ప్రవేశపెట్టడంతో మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.