: ఓం శాంతి శాంతి:... కలాంకు పార్లమెంట్ ఘన నివాళి... ఎల్లుండికి వాయిదా
భారతరత్న అబ్దుల్ కలాంకు పార్లమెంటు ఉభయసభలు ఘన నివాళి అర్పించాయి. ఆయన మృతిపట్ల సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం వహించాయి. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటని అన్నారు. భరతమాతకు కలాం చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. బరువైన హృదయంతో మహోన్నత వ్యక్తి కలాంకు వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు. రామేశ్వరంలో రేపు జరగనున్న అంత్యక్రియలకు పార్లమెంటు సభ్యులంతా హాజరుకావాలని కోరారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 'ఓం శాంతి శాంతి:' అంటూ తన ప్రసంగాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ముగించారు. అనంతరం సభను ఎల్లుండి ఉదయానికి వాయిదా వేశారు.