: కలాంకు సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుల సంతాపం


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల సోషల్ మీడియాలో పలువురు బాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను, యువతకు ఇచ్చిన విలువైన సందేశాలను గుర్తు చేసుకున్నారు. "ఎంతో విజ్ఞానం, చిన్న పిల్లల మనస్తత్వం, సాదాసీదాగా, అందరి ప్రేమకు పాత్రులైన దేశ మాజీ రాష్ట్రపతి కన్నమూశారు. ప్రార్థనలు చేయండి" అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఇక నటుడు సల్మాన్, చివరిసారిగా కలాం ట్వీట్ ను ప్రస్తావిస్తూ, 'ఆయనకు సెల్యూట్ చేస్తున్నా' అని పేర్కొన్నాడు. కలాం ఆకస్మిక మరణం ఎంతో బాధకు గురిచేసిందని, దేశానికి తీరని లోటని శ్రద్ధా కపూర్, మహేష్ భట్, అలియాభట్, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా, అనుష్కా శర్మ, అనుపమ్ ఖేర్, ప్రియాంక చోప్రా తదితరులు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News