: నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్ర ప్రభుత్వ ప్రకటన
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నేడు జాతీయ సెలవు దినం కాదని విస్పష్టంగా ప్రకటించింది. అంతేకాక నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని నేటి ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. తాను మరణిస్తే సెలవు ఇవ్వవద్దని గతంలో కలాం పేర్కొన్న సంగతి తెలిసిందే. సెలవుకు బదులు మరో రోజు అదనంగా పనిచేయాలని ఆయన సూచించిన విషయమూ విదితమే. కలాం చేసిన ఈ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న మీదటే కేంద్రం సెలవును ప్రకటించలేదని సమాచారం.