: కలాం చివరి ట్వీట్ ఏంటంటే...!


దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగిన ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు. మారుతున్న కాలానికనుగుణంగా ఆయన కూడా మారుతూనే వస్తున్నారు. అంతేకాక శాస్త్ర, సాంకేతిక రంగాలకు కొత్త జవసత్వాలను నింపారు. ఆ క్రమంలో ఆయన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనే యాక్టివ్ గానే ఉన్నారు. కీలక సందర్భాలతో పాటు, తన కార్యక్రమాలపై ఆయన నిత్యం తన ట్విట్టర్ అకౌంట్ ను అప్ డేట్ చేసేవారు. నిన్న షిల్లాంగ్ వెళుతున్న సందర్భాన్ని కూడా ఆయన తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. ‘‘నివాసయోగ్యమైన గ్రహం భూమి... అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ వెళుతున్నాను. శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే ఆయన చివరి ట్వీట్ అవుతుందని ఎవరికి తెలుసు!

  • Loading...

More Telugu News