: తెలంగాణలో నేడు సెలవే... ప్రకటించిన సీఎం కేసీఆర్
భారత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు సెలవు దినంగా పాటిస్తున్నట్లు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన అధికారికంగా ప్రకటించారు. అంతేకాక అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరికాసేపట్లో సెలవు దినానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్వర్వులు జారీ చేయనుంది.