: మా తాత అంత్యక్రియలను మా ఊళ్లోనే నిర్వహించండి: కలాం మనవడు సలీమ్
‘‘మా తాత అంత్యక్రియలను మా ఊళ్లోనే నిర్వహించండి. అధికారిక లాంఛనాలతోనే పూర్తి చేయండి’’ అని, నిన్న కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మనవడు సలీమ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కలాం బంధువర్గమంతా తమిళనాడులోని ఆయన సొంతూరు రామేశ్వరంలోనే ఉంటోంది. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ వారు కాలం వెళ్లదీస్తున్నారు. కలాం అంత్యక్రియలపై నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో కలాం అంత్యక్రియలను తమ సొంతూళ్లోనే నిర్వహించాలని ఆయన మనవడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సలీమ్ అభ్యర్థనను కూడా నేటి కేబినెట్ భేటీ పరిగణనలోకి తీసుకోనుంది. సలీమ్ ప్రతిపాదనతో పాటు ఢిల్లీలో కలాం అంత్యక్రియల నిర్వహణపైనా ప్రభుత్వం చర్చించనుంది.