: నా గొంతు మూగబోయింది...7 రోజులు సంతాపదినాలు: మోదీ
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతితో తన గొంతు మూగబోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దీనిపట్ల ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదని అన్నారు. దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని ఆయన గద్గద స్వరంతో పేర్కొన్నారు. గొప్ప దార్శనికుడు, స్పూర్తి ప్రదాతను దేశం కోల్పోయిందని ఆయన తెలిపారు. ఆయన మృతికి 7 రోజులు సంతాపదినాలుగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. కలాం చేసిన సేవలు దేశం గర్వించదగ్గవని, ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆయన తెలిపారు. ఈ క్షణాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు.