: మేధావి, రాష్ట్రపతిని మించిన గొప్ప వ్యక్తి కలాం!: జైట్లీ
మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి, మేధావిని మించిన గొప్ప వ్యక్తిగా గుర్తించడమే సముచితమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వ్యక్తిగా ఆయన నిర్దేశించిన ప్రమాణాలు అనితర సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందారన్న వార్తే వినడానికి కష్టంగా ఉందని ఆయన చెప్పారు. కలాం ఆలోచనలు, ఆశయాలు, నడవడి, బోధలు, ఇచ్చే సలహాలు, చేసే సూచనలు అన్నీ ఎంతో గొప్పవని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులతో కలిసి ఉండడం మన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. కలాం చేసిన రచనలు, చేసిన బోధనలు, చెప్పిన మాటలు, రగిలించిన స్ఫూర్తి మనతో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని జైట్లీ అభిప్రాయపడ్డారు.