: కేంద్ర మాజీ మంత్రికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష


కేంద్ర మాజీ మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పీకే తుంగన్ కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పింది. 1998లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా ఉన్న తుంగన్ 2 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు సీబీఐ న్యాయస్థానం తేల్చిచెప్పింది. 68 ఏళ్ల తుంగన్ కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధిస్తూ ఢిల్లీ సీబీఐ కోర్టు జడ్జి అజయ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న టలీ, సంగీత్ లకు చెరో మూడున్నరేళ్ల జైలు శిక్ష, మహేష్ మహేశ్వరికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు.

  • Loading...

More Telugu News