: ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణాలో త్వరలో ఉద్యోగ ప్రకటన జారీ చేయనున్న దృష్ట్యా వయోపరిమితి పెంచింది. తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయో పరిమితిని పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో తెలంగాణలో ప్రభుత్వోద్యోగార్హత వయస్సు 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. రెండు రోజుల క్రితం 15 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వయోపరిమితి సడలిస్తామని పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి సడలింపు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం కలగనుంది.