: సఫారీలతో మన సీరీస్ షెడ్యూల్ ఇదే!
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగనున్న సీరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ సీరీస్ లో రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడనున్నాయని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టు నవంబర్ 5న మొహాలీలో ప్రారంభం కానుండగా 9న ముగియనుంది. రెండో టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు బెంగళూరులో జరగనుంది. మూడో టెస్టును నవంబర్ 25 నుంచి 29 వరకు నాగ్ పూర్ లో ఆడనున్నారు. నాలుగో టెస్టు ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరగనుంది. నాలుగేళ్ల విరామం తరువాత సఫారీ జట్టు భారత్ లో సీరీస్ ఆడనుండడం విశేషం. కాగా, సీరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు.