: అసెంబ్లీ లాంజ్ లో వైఎస్సార్ ఫొటో తొలగింపు... రేపు ఉదయం వైఎస్సార్సీపీ నిరసన
హైదరాబాదులోని ఏపీ అసెంబ్లీ లాంజ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో తొలగించడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వైఎస్సార్ ఫొటో ఎలా తొలగిస్తారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ లాంజ్ లో వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించనున్నది.