: బక్క మనిషైనా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు: కేసీఆర్ పై మంత్రుల వ్యాఖ్య


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి వర్గ సహచరులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్కరాల ముగింపుపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ బక్కపలుచని మనిషైనా బలమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. గతంలో పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి అన్న భ్రమ ఉండేదని, కేసీఆర్ ఆ భ్రమను తొలగించారని అన్నారు. ఇదే స్ఫూర్తితో కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారక్కల జాతరను నిర్వహిస్తామని వారు తెలిపారు. తెలంగాణలో పుష్కరాలు విజయవంతమయ్యాయని వారు పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News