: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ సెక్రెటరీగా ఉన్న ఎ.గిరిధర్ ను ఏపీపీఎస్సీ సెక్రెటరీగా బదిలీ చేయగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా కరికల్ వలవెన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గా పి.గిరీష్, ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీగా వెంకటగోపీనాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.