: 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో కలసి ఢిల్లీలో ధర్నా చేస్తాం: జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో కలసి ఢిల్లీలో ధర్నా చేస్తామని వైకాపా అధినేత జగన్ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై తాము పలుమార్లు ఆందోళనలు చేపట్టామని... మంగళగిరిలో ధర్నా కూడా నిర్వహించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబుల కళ్లు తెరుచుకునేంత వరకు ధర్నా చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ సరిగా జరగకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.