: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
మద్దెలచెరువు సూరి హత్య కేసులో కీలక నిందితుడు భానుకిరణ్ కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. తాను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. గత మూడేళ్లకు పైగా తాను జైల్లోనే ఉంటున్నానని... ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని భానుకిరణ్ కోర్టును కోరాడు. భానుకు బెయిల్ ఇస్తే, అతను పారిపోతాడని కేసును వాదిస్తున్న సీఐడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భాను బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.