: ఆమెలా ఎవరైనా డ్యాన్స్ చేయగలరా?: హృతిక్ రోషన్

ప్రముఖ హాలీవుడ్ నటి ఫ్రిదా పింటోపై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫ్రిదా పింటో నటించిన 'డిసర్ట్ డ్యాన్సర్' సినిమా ఇటీవలే విడుదలైంది. జీవితాన్ని ఫణంగా పెట్టి గొప్ప డ్యాన్సర్ గా ఎదిగిన ఓ యువతి జీవిత కథ నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్రను ఫ్రిదా పోషించింది. ఈ సినిమాను వీక్షించిన హృతిక్ ఆమెపై ట్విట్టర్లో ప్రశంసలు కురిపించాడు. ఆమె అద్భుతంగా నటించిందని, ఆమెలా ఎవరైనా డాన్స్ చేయగలరా? అని హృతిక్ ప్రశ్నించాడు. అలాగే చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపాడు.