: నటి షమితా శెట్టి ముక్కుకు ఫ్రాక్చర్
ప్రముఖ సినీ నటి షమితా శెట్టి (శిల్పా శెట్టి సోదరి) డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె ముక్కుకు ఫ్రాక్చర్ అయింది. రెండు కుట్లు కూడా పడ్డాయి. ఈ విషయాన్ని శిల్పా శెట్టి ట్విట్టర్ ద్వారా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, ఓ ఛానల్ లో ప్రసారం అవుతున్న 'ఝలక్ దిక్ లాజా' రియాల్టీ షోలో షమితా శెట్టి పాల్గొంటోంది. ఈ షో కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఆమె కాలు జారి పడింది.