: సెక్షన్-8 కోరినందుకు నన్ను వేధిస్తున్నారు... నా కుమార్తెను స్కూల్ నుంచి తొలగించారు: ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేత
హైదరాబాదులో సెక్షన్-8ని అమలు చేయాలని కోరినందుకు తనను వేధిస్తున్నారని, తన కుమార్తెను జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి తొలగించారని ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేత వీరరాఘవరెడ్డి వాపోయారు. ఇదే విషయమై ఈరోజు ఆయన గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిలో తమకు రక్షణ కరవైందని... ఈ విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరారు. అంతేకాకుండా, హైదరాబాదులో ఆంధ్ర అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని గవర్నర్ సలహాదారులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.