: పంజాబ్ లో దాడి...జమ్మూలో జరిగినట్టుంది: ఒమర్ అబ్దుల్లా
పంజాబ్, గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ లో జరిగిన ఉగ్రదాడి జమ్మూలో జరిగినట్టు అనిపిస్తోందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులు దాడి చేసిన సమయం, దాడి విధానం చూస్తుంటే జమ్మూలో దాడుల విధానాన్ని పోలి ఉందని ఆయన ట్విట్టర్లో తెలిపారు. కాగా, గురుదాస్ పూర్ లో జరిగిన ఉగ్రదాడిలో పదమూడు మంది మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. గురుదాస్ పూర్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశం మొత్తం అప్రమత్తమైంది.