: రాజశేఖరరెడ్డి పులివెందులకు కూడా నీరు ఇవ్వలేకపోయారు... జగనేం చేస్తారు?: గాలి ముద్దుకృష్ణమ
వైకాపా అధినేత జగన్ పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండి రాయలసీమలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని... కనీసం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. 'ముఖ్యమంత్రి అవుతా... హంద్రీనీవా నిర్మిస్తా' అని చెబుతున్న జగన్ పై స్పందిస్తూ... జగన్ సీఎం అయ్యేదీ లేదు, హంద్రీనీవా కట్టేదీ లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే... ఇంతవరకు కేసీఆర్ ను జగన్ ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుపై ఢిల్లీలో ఫిర్యాదు చేసిన జగన్ కు... ఫోన్ ట్యాపింగ్ సీరియస్ అంశంగా కనబడలేదా? అని ప్రశ్నించారు.