: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కావాలి: పంజాబ్ సీఎం
గురుదాస్ పూర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి ఘటనను పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఖండించారు. ఉగ్రవాదుల దాడి ఘటన దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదం రాష్ట్ర సమస్య కాదని జాతీయ సమస్య అని వ్యాఖ్యానించారు. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం అవసరమని బాదల్ అభిప్రాయపడ్డారు.