: గుంటూరు జిల్లాలో స్వల్ప భూకంపం... 2 సెకన్ల పాటు కంపించిన భూమి


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానికి కేంద్రగా మారనున్న గుంటూరు జిల్లాలో కొద్దిసేపటి క్రితం స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని శావల్యాపురం, మతుకుమిల్లి, గొందులపాలెం తదితర ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ధాటికి జరిగిన నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భూకంప తీవ్రత స్వల్పంగానే ఉన్నందున పెద్దగా నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News