: హైదరాబాద్ లో బోగస్ ఓట్ల పేరుతో అసలు ఓట్లు తొలగిస్తే న్యాయపోరాటం చేస్తాం: కిషన్ రెడ్డి


హైదరాబాద్ లో 15 లక్షలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషనర్ రెడ్డి మండిపడుతున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం అవసరంలేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లను తొలగిస్తే తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను మతంతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు. ఉగ్రవాదులకు, మతానికి సంబంధం లేదన్నారు.

  • Loading...

More Telugu News