: ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారు: ఏపీ మంత్రి పీతల సుజాత
ఓటుకు నోటు వ్యవహారంలో తెరమీదకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ సర్కారు కూలడం ఖాయమేనని నిన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి పీతల సుజాత కేసీఆర్ పై ఫైరయ్యారు. ఓటుకు నోటు పేరిట తమ పార్టీతో పాటు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఇరుకునపెట్టేందుకు యత్నించిన కేసీఆర్, తాను ఉచ్చులో చిక్కుకుని అడ్డంగా బుక్కయ్యారని పీతల సుజాత ఆరోపించారు. తాము ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయలేదన్న కేసీఆర్ మాటలు.. సుప్రీంకోర్టులో సర్వీస్ ప్రొవైడర్ల వాదనతో వీగిపోయాయని ఆమె చెప్పారు.